- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ అంటేనే...జూటాకోర్ పార్టీ... : మంత్రి హరీశ్ రావు
దిశ, అందోల్: కాంగ్రెస్ అంటేనే జూటాకోర్ పార్టీ...నేరవేరని హామీలివ్వడం...ఇచ్చిన మాటాను నిలబెట్టుకొకపోవడం...కాంగ్రెస్ పార్టీ నైజమని మంత్రి హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 2009లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఆ పార్టీని నమ్మితే మోసపోతామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ దుష్ట పాలనను చూస్తే ప్రజలకు అర్థమవుతుందన్నారు. శుక్రవారం అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ వట్‌పల్లిలో నిర్వహించిన అలయ్–బలాయ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే నయవంచన...బీఆర్‌ఎస్ అంటే ప్రజల్లో ఒక నమ్మకం ...భరోసా అని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ ఆనాడు 11 రోజుల పాటు అమరదీక్షను చేపట్టి ఢీల్లీ మెడలు వంచి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాడని, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాన్ని ఆగం చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రవేశపేట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజల్లో మంచి స్పందన వస్తుందని, కాంగ్రెస్ పార్టీ వాళ్లు అవే పథకాలను కాపీ కొడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు 11 సార్లు గెలిపిస్తే వ్యవసాయాన్ని దండగ చేసిందని, ఆదే బీఆర్‌ఎస్ పార్టీని రెండు పర్యాయాలు గెలిపిస్తే 11 సార్లు రైతు బంధు ఇచ్చి, వ్యవసాయాన్ని పండుగ చేసిందన్నారు.
వ్యవసాయానికి 24 గంటలు ఎందుకని మూడు గంటలు సరిపొతుందని కాంగ్రెస్ పార్టీ అంటుందన్నారు. మూడు గంటల కరెంట్ అంటే రైతులు కాంగ్రెస్ వాళ్ల దౌడ పళ్లు రాలగొడతారన్నారు. కేసీఆర్‌కు పనితనమే తెలుసునని, పగతనం తెలియదని, అలా చేసుంటే కాంగ్రెస్ వాళ్లు సగం మంది జైల్లో ఉండేవారన్నారు. ‘పల్లె పల్లేనా పల్లేర్లు మొలిచే’, ‘నేను రాను బిడ్డొ సర్కారు దవాఖానకు’ అని గొరటి వెంకన్న రాసిన పాటను నేడు తిరగ రాయాల్సిన పరిస్థితులను బీఆర్‌ఎస్ సర్కార్ తీసుకొచ్చిందన్నారు. బొంబాయి, దుబాయ్ ప్రాంతాలకు వలసలు పూర్తిగా తగ్గాయని, నాడు కైకిలు దొరకలేదని, నేడు కైకిలోల్లు దోరకని పరిస్థితి ఉందన్నారు. నాడు సింగూరును ఎండగొడితే, నేడు సింగూరును నింపేలా ప్రణాళిక చేశారన్నారు. కాంగ్రెస్ వాళ్లు చేసే గ్లోబల్ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, నిజం గడప దాటకముందే అబద్దం ఊరంతా తిరిగి వస్తుందని, కళ్ల ముందు ఉన్న అభివృద్దిని మాత్రమే నమ్మాలన్నారు. సర్వేలన్నీ బీఆర్‌ఎస్ భారీ మేజార్టితో గెలుపు ఖాయమంటున్నాయన్నారు. మోసపోతే గోస పడతామని, ఓటు రూపంలో ప్రజలు నిర్ణయాన్ని వెల్లడించాలన్నారు.
గడప గడపకు బీఆర్‌ఎస్ మేనిపెస్టోను తీసుకేళ్లాలి:
బీఆర్‌ఎస్ పార్టీ ప్రవేశపేట్టిన మేనిఫెస్టోను గడపగడపకు తీసుకేళ్లాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. రైతు బంధు కింద ఎకరానికి రూ.16 వేలు, వంట గ్యాస్ రూ.400లకు, సౌభాగ్య లక్ష్మీ ద్వారా మహిళలకు నెలకు రూ. 3 వేలు, రేషన్ కార్డులో ఉన్న వాళ్లకు ఒక్కోక్కరికి 6 కిలోల సన్నబియ్యం అందిస్తామన్నారు. ఏటా రూ. 1300 కోట్లు భారం పడుతున్న గురుకులాల్లో సన్నబియ్యం, పెద్దలకు కూడా ఇస్తామన్నారు. రైతు బీమా మాదిరిగానే కోటి కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆసరా పథకం కింద రూ.5వేలు పింఛన్‌ను ఇస్తామన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 15 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందిస్తామన్నారు. ఆసైన్ఢ్ భూములకు పూర్తి హక్కులను కల్పిస్తామని, ఇవేకాకుండా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజా సంక్షేమ పథకాలను సైతం ప్రజలకు వివరించాలన్నారు.
ధూమ్..ధామ్‌గా ఆలయ్–బలాయ్:
దసరా పండుగ సందర్భంగా వట్‌పల్లిలో అందోలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో అలయ్–బలయ్ కార్యక్రమానికి చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హజరయ్యారు. మంత్రి హరీష్‌రావు, ఎంపీ బీబీ పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ గొరెటి వెంకన్న, మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, ప్రెస్ ఆకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ పి. జైపాల్ రెడ్డిలతో పాటు తదితరులు ఒకరినొకరు అలింగనం చేసుకుని దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అక్కడికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. అలయ్–బలయ్ కార్యక్రమానికి విచ్చేసిన వారికి భోజన సదుపాయాన్ని కల్పించారు.