MLA Chinta Prabhakar : రుణమాఫీతో కాంగ్రెస్ నేతల మొహంలోనే ఆనందం

by Sridhar Babu |
MLA Chinta Prabhakar : రుణమాఫీతో కాంగ్రెస్ నేతల మొహంలోనే ఆనందం
X

దిశ, సంగారెడ్డి : రుణమాఫీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. రూ.31 వేల కోట్లు ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటనలు ఇచ్చి కేవలం రూ.6 వేల కోట్లు మాత్రమే చేశారని ఆరోపించారు. రైతులకు కాంగ్రెస్ చేసింది గోరంత అని దానిని కొండంతలుగా గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో మొదటి విడతలో 35 లక్షల మంది

రైతులకు రూ.17 వేల కోట్ల రుణ మాఫీ కింద చెల్లించామన్నారు. లక్ష లోపు రుణాల మొత్తం కేసీఆర్ హయాంలో రూ.19 వేల కోట్లు ఉంటే ఇప్పుడు రూ.6 వేల కోట్ల కు ఎలా తగ్గిందని, ఎవర్ని మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో రైతుల అకౌంట్ల లోకి పదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు చేరిందని, రూ.70 వేల కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ రైతులకిచ్చారని కొనియాడారు. రుణమాఫీ కాంగ్రెస్ నేతల మొహం లోనే ఆనందం కనిపిస్తుందే తప్ప రైతుల మొహం లో లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయని, వాటి పై ప్రజలు నిలదీస్తూనే ఉంటారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed