- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్,బీఆర్ఎస్ లు బొమ్మా బొరుసు లాంటివి : మెదక్ ఎంపీ
దిశ, జగదేవ్ పూర్ : ప్రపంచంలోని అగ్రరాజ్యాలు సైతం నేడు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని, ఇందుకు ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్దాన్ని నివారించడానికి మోడీని మద్యవర్తిత్వం వహించాలని పుతిన్ దేశం కోరడమే నిదర్శనమని మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఎం.రఘునందన్ రావు పేర్కొన్నారు. మంగళవారం జగదేవ్ పూర్ మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ బుద్ధ జ్యోతి మహేందర్ చాట్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు దేశాయి రెడ్డి ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం స్థానిక ఎస్ వీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బొమ్మా బొరుసు లాంటివని బీఆర్ఎస్ పదేళ్ల పరిపాలనలో ఒకే కుటుంబం దోచుకుంటే కాంగ్రెస్ పార్టీలో పదిమంది నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 38 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆ పాత్ర పోషించలేకపోతున్నారని కనీసం గజ్వేల్ లో సైతం కనిపించడంలేదని గొడవలు జరుగుతుండడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ ఒక క్రమశిక్షణ గల పార్టీ అని దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల బలం కేవలం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. పైరవీలకు ఆస్కారం లేకుండా కష్టపడి పని చేసిన వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు తెలంగాణలో భవిష్యత్తులో బీజేపీ జెండా ఎగురవేయనుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో గ్రామ బూత్ కమిటీల్లో సభ్యత్వాలు ముమ్మరంగా చేయించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పిటిసి ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవాలని ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా బూత్ కమిటీల్లో 200ల పార్టీ సభ్యత్వాలు నమోదు చేయించిన నాయకులను ఆయన శాలువాతో సన్మానించారు.