- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేయండి: కలెక్టర్ శరత్
by Kalyani |
X
దిశ, సదాశివపేట: ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపాదికన త్వరగా పూర్తిచేసి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ శరత్ కాంట్రాక్టర్లకు అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణ పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
ఇకనుంచి పనుల్లో వేగం పెంచి నిర్మాణాన్ని పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొచ్చేలా ప్రయత్నించాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ మ్యాపును జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, ఇంజనీర్ రాజేష్, ఉప తహసీల్దార్ విష్ణు, ఆర్ఐ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story