- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ శరత్
దిశ, సంగారెడ్డి: సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ శరత్ పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, కరుణా హై స్కూల్ పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయా గదుల్లో తిరుగుతూ, పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు.
విద్యార్థుల హాజరును కలెక్టర్ ఆరా తీశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివొద్దని చీఫ్ సూపరింటెండెంట్ లకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను, మౌలిక సౌకర్యాలను పరిశీలించారు. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండటంపై కలెక్టర్ శరత్ సంతృప్తిని వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ విజయకుమార్, చీఫ్ సూపరింటెండెంట్లు, తదితరులు ఉన్నారు.