రైతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకురావడంపై సీఎం సీరియస్

by Kalyani |
రైతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకురావడంపై సీఎం సీరియస్
X

దిశ, సంగారెడ్డి : లగచర్ల రైతు ఈర్యా నాయక్ ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. ఘటనపై అధికారులను ఆరా తీసిన సీఎం, రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. లగచర్ల నిందితుడు ఈర్యా నాయక్ గుండెపోటు రాగా జైలు అధికారులు పోలీసుల సహకారంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకువచ్చారు. ఆసుపత్రికి తరలించిన సందర్బంగా ఈర్యానాయక్ కు ఇనుప సంకెళ్లు వేసి ఆసుపత్రికి తీసుకువచ్చారు. నిందితుడు గుండె నొప్పి వచ్చి చావు బతుకుల మధ్య ఉంటే రైతు అని చూడకుండా ఓ గరడు గట్టిన నేరస్తుని వలే సంకెళ్లు వేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి తెలిసి రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని సీఎం హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed