- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోనాయిపల్లి దేవాలయంలో.. నామినేషన్ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు
దిశ, సిద్దిపేట ప్రతినిధి: సెంటిమెంట్ దేవాలయం కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో సీఎం కేసీఆర్ శనివారం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కోనాయిపల్లి కి మధ్యాహ్నం 12:30 నిమిషాలకు చేరకున్న సీఎం కేసీఆర్ కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రదక్షణ చేసిన అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులుకు సంబంధించిన నామినేషన్ పత్రాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నామినేషన్ పత్రాలపై, హరీష్ రావు సిద్దిపేట నామినేషన్ పత్రాలపై ఆలయ ప్రాంగణంలో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న నాయకులతో సీఎం కేసీఆర్ కరచాలనం చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ వేలేటి రోజాశర్మ, సూడా చైర్మన్ మారెడ్డి. రవీందర్ రెడ్డి, నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, జాప. శ్రీకాంత్ రెడ్డి, కొండం సంపత్ రెడ్డి, రాజనర్సు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ పదమూడో పర్యాయం, హరీష్ రావు ఏడోసారి పూజలు
స్వతహాగా దైవభక్తి, సెంటిమెంట్ ను నమ్మే సీఎం కేసీఆర్ తాను తలపెట్టిన కార్యక్రమానికి దైవానుగ్రహం కూడా తొడవ్వాలనే భావనతో ఏ ఎన్నికలైన సరే 38 ఏళ్లుగా కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయంలో పూజలు చేయించడం అనవాయితీగా మారింది. 1985లో మొదటి సారి సిద్దిపేట ఎమ్మెల్యేగా గొలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2006, 2008, 2009, 2010. 2014, 2018లలో జరిగిన ఎన్నికల సమయంలో కోనాయిపల్లి వేకంటేశ్వరస్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించి, నామినేషన్ వేశారు. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సైతం నామినేషన్ పత్రాలకు పూజలు చేయించి, కోనాయపల్లి దేవాలయ ప్రాంగణంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఆ అనావాయితీని మంత్రి హరీష్ రావు సైతం ఏడో సారి ఫాలో అయ్యారు.