మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట: మంత్రి హరీష్ రావు

by Shiva |
మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట: మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దపేట ప్రతినిధి: ఈద్-ఉల్-ఫితర్ ప‌ర్వదినం సంద‌ర్భంగా ముస్లిం సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రంజాన్ పవిత్ర మాసం ఉపవాస దీక్షలు, ప్రేమ‌, ద‌య సౌభ్రాతృత్వ గుణాల‌ను పంచుతోంద‌ని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట వేశారని అన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ర్ట ప్రభుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ముస్లింల జీవితాల్లో నూతన వెలుగులు నింపుతూ గుణాత్మక ఫ‌లితాల‌ను ఇస్తున్నాయ‌ని తెలిపారు.

గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని, లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. గురుకులాల ద్వారా మైనారిటీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు ఓవర్సీస్‌ స్కాలర్ షిప్ ద్వారా రూ.20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. అల్లా దయతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నాని మంత్రి హరీష్ రావు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed