- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి'
దిశ, సిద్దిపేట ప్రతినిధి: గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పాలకుర్తి నుండి పట్నం వరకు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం గా సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పంచాయతీ కార్మికులు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికులను కనీస వేతనం అమలు చేయాలన్నారు. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికులు జిల్లా పంచాయతీ అధికారి దృష్టి తీసుకెళ్లితే.. వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. జిల్లా పంచాయతీ అధికారిని వెంటనే విధులు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి కుమార్, సింగిరెడ్డి చంద్రారెడ్డి, అమ్ముల బాల నర్సు, మామిడాల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.