KCR నాయకత్వంలో పల్లెలు అభివృద్ధి చెందుతున్నయ్.. చింత ప్రభాకర్

by Javid Pasha |   ( Updated:2022-11-27 08:22:19.0  )
KCR నాయకత్వంలో పల్లెలు అభివృద్ధి చెందుతున్నయ్.. చింత ప్రభాకర్
X

దిశ, కంది: కేసీఆర్ నాయకత్వంలో పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని, పట్టణాలకు ధీటుగా తయారవుతున్నాయని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. ఆదివారం కంది మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు గొంగడి కప్పి స్వాగతం పలికిన యాదవ సోదరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. '' నా పెళ్లప్పుడు కూడా కట్నం కింద అత్తమామలు నాకు గొంగడి పెట్టారు'' అంటూ గుర్తు చేసుకున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు మునుపెన్నడూ లేని విధంగా పచ్చదనంతో కనబడుతున్నాయని అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వ పని తీరును మెచ్చే కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవార్డులు ఇచ్చిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలు మరింత అభివృద్ధిని సాధిస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, ఎంపీపీ సరళ పుల్లారెడ్డి, కంది టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చిలువరి ప్రభాకర్, రామ్ రెడ్డి, ఖాజా ఖాన్, వేణు వర్ధన్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed