- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలల వైజ్ఞానిక ప్రదర్శన భళా.. : మంత్రి పొన్నం
దిశ, సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట బాలికల ఉన్నత పాఠశాల డా.అబ్దుల్ కలాం ఆజాద్ ప్రాంగణంలో జిల్లా స్థాయి 52 వ బాలల వైజ్ఞానిక ప్రదర్శన ను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సైన్స్ ఫెయిర్ లో వివిధ స్టాల్ లను మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో కాలుష్యం నివారణ, నియంత్రణ చర్యలు తదితర అంశాలపై పరిశోధనలు పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో కాలుష్యం వలన పాఠశాలలకు సెలవులు ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణలో వాతావరణ కాలుష్యం తగ్గించేలా అనేక పాలసీలను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
నీటి వృదా అరికట్టడం, ప్రకృతి కాపాడడానికి ఇజ్రాయిల్ తరహాలో రాష్ట్రంలో వ్యవసాయం రంగంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సూర్యరశ్మి శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. టెక్నాలజీ లో ప్రపంచమే కుగ్రామం అయిందన్నారు. ఇన్నోవేషన్ ఎంత ఉపయోగకరంగా ఉండాలన్నారు. సైన్స్ ఫెయిర్ ల ద్వారా విద్యార్థుల్లో చైతన్యాన్ని, ప్రతిభను, విజ్ఞానాన్ని మరింత పెంచడానికి దోహద పడతాయని అభిప్రాయ పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమోషన్లు, బదిలీలు చేపట్టినట్లు గుర్తు చేశారు. అదే విధంగా అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, గురుకుల పాఠశాలకు కాస్మొటిక్ మెస్ చార్జీలు పెంచినట్లు తెలిపారు. యూనిఫాం ,షూస్, పుస్తకాలు సరైన సమయానికి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.