మెదక్ జిల్లాలో చిరుత సంచారం.. ఆందోళనలో శంశిరెడ్డిపల్లి తండా వాసులు

by srinivas |   ( Updated:2023-05-16 05:19:27.0  )
మెదక్ జిల్లాలో చిరుత సంచారం.. ఆందోళనలో శంశిరెడ్డిపల్లి తండా వాసులు
X

దిశ, వెబ్ డెస్క్: మెదక్ జిల్లా శంశిరెడ్డిపల్లి తండాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. పశువుల పాకపై దాడి చేసి లేగడూడను చంపేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ స్పందించి చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. స్థానిక అటవీ ప్రాంతం నుంచి చిరుత వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాత్రి సమయంలో తండాకు వచ్చి పశువులపై దాడి చేస్తున్నట్లు గుర్తించారు. చిరుతను బంధించే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story