బీఆర్ఎస్‌కు కార్యకర్తలే బలగం: ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

by Sumithra |
బీఆర్ఎస్‌కు కార్యకర్తలే బలగం: ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
X

దిశ, టేక్మాల్/ అల్లాదుర్గం: ప్రజల సంక్షేమాన్ని కోరి ప్రవేశపెట్టిన పథకాలే భారత రాష్ట్ర సమితికి పార్టీ శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ ఓ ప్రయివేట్ ఫంక్షన్ హాల్‌లో ఆత్మీయ సమ్మేళనంకు హాజరయ్యారు.టేక్మాల్ మండల పరిధిలోని బోడ్మట్ పల్లిలో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన అనంతరం ముస్లాపూర్ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్,బీజేపీ పార్టీలు మతం పేరుతో రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నాయని, వారికి ప్రజలు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు.గత పాలకులు ప్రజలకు అందుబాటులో లేక ప్రజలు అవస్థలు పడ్డారని, కానీ ప్రస్తుతం స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని చెప్పారు.

రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా ఉండి పనిచేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. టేక్మాల్ మండలంలో గుండు వాగు సమస్యను త్వరలోనే తీరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. నాయకులు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.కార్యకర్తలే పార్టీకి బలం,బలగం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి ఎగ్గే మల్లేశం,మాజీ ఎంపిపి కాశినాథ్,టేక్మాల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్,టేక్మాల్ ఎంపీపీ చింత స్వప్న రవి, మాజీ జెడ్పిటిసి ముక్తార్, ,లింగా గౌడ్,జగన్ మోహన్ రెడ్డి,రమేష్ నాయక్,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed