శ్రీధర్ గుప్తాపై చంద్ర పాల్ ఫైర్

by Mahesh |
శ్రీధర్ గుప్తాపై చంద్ర పాల్ ఫైర్
X

‘శ్రీధర్ గుప్తా దొంగ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం సాగిస్తున్నాడు.. అతని వద్ద ధాన్యం సంబంధించి తౌడు, పొట్టు కరెంట్ బిల్లు లు ఎక్కడున్నాయో చెప్పాలని’ మెదక్ మున్సిపల్ చైర్మన్, మెదక్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రపాల్ ఫైర్ అయ్యారు. వారం రోజులుగా శ్రీధర్ గుప్తాకు చంద్రపాల్ కు మధ్య జరుగుతున్న వివాదంతోపాటు దిశ పత్రికలో శనివారం శ్రీధర్ గుప్తా ఆరోపణపై వచ్చిన కథనంపై స్పందిస్తూ మెదక్ రైస్ మిల్లర్స్ గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీధర్ గుప్తా జూట వ్యాపారం చేస్తున్నాడని రాష్ట్రవ్యాప్తంగా మెదక్ జిల్లాకు రైస్ మిల్లర్స్ లో మంచి విలువ ఉందని, శ్రీధర్ గుప్తా వల్ల జిల్లాకే చెడ్డ పేరు వస్తుందన్నారు. ఆయనపై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అవినీతికి పాల్పడ్డట్లు నిరూపిస్తే అసోసియేషన్ అధ్యక్ష , మున్సిపల్​ చైర్మన్​ పదవులకు రాజీనామా చేస్తానని సవాల్​ విసిరారు.

దిశ, మెదక్​ ప్రతినిధి: జిల్లా, డివిజన్ అసోసియేషన్ లో సభ్యత్వం లేని వ్యక్తి లెక్కలపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అసోసియేషన్ లో లావాదేవీలు ప్రశ్నించడానికి కనీసం సభ్యత్వం ఉందా అని శ్రీధర్​ గుప్తాను మెదక్​ జిల్లా రైస్​ మిల్లర్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు చంద్రపాల్​ ప్రశ్నించారు. శ్రీధర్ గుప్తాకు చంద్రపాల్ కు మధ్య జరుగుతున్న వివాదంతోపాటు దిశ పత్రికలో శనివారం శ్రీధర్ గుప్తా ఆరోపణపై వచ్చిన కథనంపై స్పందిస్తూ మెదక్ రైస్ మిల్లర్స్ గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా గోదాంను ఎలా ఏర్పాటు చేసి ధాన్యాన్ని ఉంచుతారని నిలదీశారు. రైతుల పేరుతో అనుచరులను ముందుంచి అధికారులు వస్తే అడ్డుకునే నీచ సంస్కృతి ఆయనకే ఉందన్నారు.

ప్రత్యేక గోదాములు ఎవరికి ఇవ్వరని, కానీ అక్రమంగా గోదాం ఏర్పాటు చేసినా అధికారులు కూడా ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తనను చంపేస్తానని బెదిరించిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, అధికారులు చర్యలు తీసుకోకుంటే ప్రైవేట్ గా కేసు నమోదు చేస్తానని హెచ్చరించారు. 5000 టన్నుల ధాన్యం అనుమతి తెచ్చినట్లు నిరూపిస్తే తన పదవులు అన్నిటికి రాజీనామా చేస్తానని చంద్రపాల్ సవాల్ విసిరారు. శ్రీధర్ గుప్తా చేస్తున్న ఆరోపణలు పక్కదారి పడతాయి అన్న ఉద్దేశంతోనే దీనికి ముగింపు పలికేందుకు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి బీహారి కూలీలతో యాక్సిడెంట్ చేపిస్తానన్న శ్రీధర్ గుప్తాను వదిలే ప్రసక్తి లేదన్నారు. నా ప్రతిష్ట కు భంగం కలిగిస్తున్న శ్రీధర్ గుప్తా పై రూ.10 కోట్ల పరువునష్టం దావా వేస్తానన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 80 శాతం సివిల్ సప్లై, 20 శాతం ఎఫ్​ సీఐ ద్వారా సీఎంఆర్ బియ్యం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లాలోని రైస్ మిల్లర్లంతా నిబంధనలకు లోబడి పనిచేస్తే మిల్లర్ శ్రీధర్ గుప్తా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మూడు మిల్లులు లీజుకు తీసుకొన్న శ్రీధర్ గుప్తా కు ఖరీఫ్, రబీ సీజన్ లో సుమారు రూ 60 కోట్ల విలువ గల ధాన్యాన్ని అధికారులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. 50 లారీల కెపాసిటీ గల గోదాములున్న శ్రీధర్ గుప్తాకు 24 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఏలా ఇస్తారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతానికి ఆ ధాన్యం అతని రైస్ మిల్లులో ఉందా అని ప్రశ్నించారు. గోదాముల వద్ద జిల్లాలోని ఇతర మిల్లర్ల లారీలు 10 రోజులు ఆగితే శ్రీధర్ గుప్తా లారీలు ఒక్కరోజులోనే ఖాళీ అవుతున్నాయన్నారు. కొందరు అధికారులు, గోదాం సిబ్బంది అండదండలతో శ్రీధర్ గుప్తా చెలరేగిపోతున్నారని ఆరోపించారు.

తనపై బెదిరింపులకు పాల్పడ్డ శ్రీధర్ గుప్తాపై సివిల్ సప్లై కమిషనర్ కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, సీఐకు రైస్ మిల్లర్స్ తో కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేయకుంటే కోర్టు ద్వారా ముందుకు సాగుతానన్నారు. రూ.మూడు కోట్ల అసోసియేషన్ డబ్బులు తాను వాడుకున్నానని శ్రీధర్ గుప్తా ఆరోపణలు చేశారని, అసోసియేషన్ డబ్బులు కొన్ని యూనియన్ బ్యాంక్ ఖాతాలో ఉన్నాయని, కొన్ని కాంట్రాక్టర్ల దగ్గర ఉన్నాయన్నారు. అవసరమైతే అకౌంట్ నెంబర్ లో చెక్ చేసుకోవచ్చన్నారు. తాను అసోసియేషన్ లో అవినీతికి పాల్పడ్డట్లు నిరూపిస్తే అధ్యక్ష పదవికి, మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రాష్ట్రంలోనే మెదక్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆదర్శంగా ఉండేదని, శ్రీధర్ గుప్తా లాంటి నీచపు వ్యక్తుల వల్ల అసోసియేషన్ కు చెడ్డ పేరువస్తుందన్నారు. జిల్లా లోని రైస్ మిల్లర్ల కు సేవా చేయడానికి తానెప్పుడూ సిద్ధమేనన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఆయా తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోశ్​ రెడ్డి, రాజేందర్, అశోక్, రవి, గౌరీ శంకర్, వేణుగోపాల్, చందర్, శంకర్, శ్రీనివాస్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed