- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
State Govt : రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం..
దిశ, సిద్దిపేట ప్రతినిధి : పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎబీవీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబీవీపీ జిల్లా కన్వీనర్ వివేక్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న విద్యాశాఖకు 6.5 శాతం మాత్రమే నిధులు కేటాయించడం విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దికి నిదర్శనం అన్నారు.
మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రూ.7800 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో పేద విద్యార్థులు చదువుకు దూరంగా కావాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిత్య , పవన్, నగర కార్యదర్శులు పరశురాం, రాహుల్, ఫణీంద్ర, సంతోష్, జస్వంత్, భాను, రాజు, రాకేష్, గోవర్ధన్, అక్షిత్, సంజయ్, భీమన్న, ప్రణయ్, విద్యార్థులు పాల్గొన్నారు.