- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ను హెచ్చరించిన బీఆర్ఎస్ నాయకులు..
దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న మాజీ ఎమ్మెల్యే, టీఎస్హెచ్ డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ జోలికి వస్తే ఖబర్దార్ అంటూ బీఆర్ఎస్ పట్టణ నాయకులు హెచ్చరించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చింతా ప్రభాకర్ దిష్టిబొమ్మను తగలబెట్టడాన్ని నిరసిస్తూ సంగారెడ్డిలోని చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల నర్సింలు, కౌన్సిలర్లు కొత్తపల్లి శ్రీకాంత్, సమీ, అంజద్, ఆజీమ్ లు మాట్లాడుతూ మున్సిపల్ సమావేశంలో అభివృద్ధి కొన్ని వార్డుల్లోనే జరుగుతుందని, అన్ని వార్డులను సమానంగా చూడాలని చైర్ పర్సన్ ను ప్రశ్నిస్తే కాంగ్రెస్ కౌన్సిలర్ అడ్డుకోవడం విచాకరమన్నారు.
బీఆర్ఎస్ పార్టీ చైర్ పర్సన్ ను, బీఆర్ఎస్ కౌన్సిలర్లు అభివృద్ధి కావాలని అడిగితే కాంగ్రెస్ కౌన్సిలర్ షపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కౌన్సిలర్ ఇస్టారీతిన భూతులు మాట్లాడాడని, అందుకు అతనిపై పోలీసు స్టేషన్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కేసుపెట్టారన్నారు. కౌన్సిలర్లు కేసుపెడితే చింతా ప్రభాకర్ కు ఏం సంబంధం ఉంటుందని, ఆయన దిష్టిబొమ్మను ఎందుకు తగులబెట్టారని ప్రశ్నించారు. చింతా ప్రభాకర్ సంగారెడ్డి పట్టణంలో, నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాడని, ఓడిపోయినా కూడా ప్రజల పక్షాన ఉన్నాడన్నారు. అలాంటి వ్యక్తి పై కాంగ్రెస్ నాయకులు అనవసరంగా మాట్లాడితే ఖబర్దార్ మరొక్కసారి చింతా ప్రభాకర్ జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కసిని శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, అజ్జూ, యూనిస్, మసూద్ తదితరులు పాల్గొన్నారు.