భారీ వర్షానికి గ్రామాలు జలమయం..

by Sumithra |
భారీ వర్షానికి గ్రామాలు జలమయం..
X

దిశ, కొండపాక : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొండపాక కుకునూర్ పల్లి మండలంలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. దుద్దెడ శివారులో అంకిరెడ్డిపల్లి, బందారం గ్రామాలకు వెళ్లే రోడ్డు వర్షపు నీటికి తెగిపోయింది. దాంతో ఆ రెండు గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామపంచాయతీ సిబ్బంది హెచ్చరిక చేస్తూ రోడ్డు పై ఎవరు వెళ్లకుండా తాడుతో అడ్డంగా కట్టారు. వర్షపు నీటికి పంట పొలాలన్నీ మునిగిపోయాయి. కొండపాక మండలం వెలికట్ట క్రాస్ రోడ్డు వద్ద చేర్యాల రోడ్డుపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలు ఇండ్లలోకి వర్షం నీరు చేరింది.

అలాగే మండలంలోని బందారం గ్రామంలోని లోతట్టు ప్రాంతంలో సుమారు 10 ఇండ్లలోకి నీరు చేరడంతో ఇబ్బందులకు గురయ్యారు. అలాగే కుకునూర్ పల్లి మండల కేంద్రంలో బాస్టాండ్ నుండి ముద్దపూర్ రోడ్డు వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులకు గురైనారు. ఈ విషయం తెలుసుకున్న కుకునూర్ పల్లి ఎస్పీ శ్రీనివాస్ తన సిబ్బంది, టోల్ గెట్ సిబ్బందితో కలసి నీటిని నిల్వకుండా చర్యలు చేపట్టారు. వరకు పలు గ్రామాల్లో ఇండ్లుపాక్షికంగా దెబ్బతిన్నాయి.

Advertisement

Next Story

Most Viewed