జహీరాబాద్‌లో వికసించిన బ్రహ్మ కమలాలు

by Aamani |
జహీరాబాద్‌లో వికసించిన బ్రహ్మ కమలాలు
X

దిశ,జహీరాబాద్/ఝరాసంగం: హిమాలయ పర్వతాలు, శీతల ప్రదేశాలలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే వికసించే అరుదైన బ్రహ్మకమలాలు గురువారం రాత్రి జహీరాబాద్ పట్టణంలో కనువిందు చేశాయి. పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో నివాసం ఉండే ఝరాసంగం మండల బర్దిపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జ్యోతి, వేణుగోపాల్ రెడ్డి కి చెందిన ఇంటి ఆవరణలో గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒకేసారి 10 బ్రహ్మ కమలాలు వికసించాయి.

దీంతో జ్యోతి, వేణుగోపాల్ రెడ్డి దంపతులతో పాటు కాలనీకి చెందిన పలువురు మహిళలు బ్రహ్మ కమలాలకు ప్రత్యేక పూజలు మంగళ హారతులు నిర్వహించారు. బ్రహ్మ కమలాల వికాసంతో కాలనీ మొత్తం సుగంధపు వాసన వెదజల్లింది. కాగా సూర్యోదయంతో వికసించేది తామర పుష్పం అయితే, చంద్రోదయంతో వికసించే సద్గుణం కలిగింది ఒక్క బ్రహ్మ కమలం మాత్రమే.

Next Story

Most Viewed