భజరంగ్ దళ్ సంస్థ నిషేధాన్ని విరమించుకోవాలి : బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి

by Shiva |
భజరంగ్ దళ్ సంస్థ నిషేధాన్ని విరమించుకోవాలి : బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి
X

దిశ, సంగారెడ్డి : కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో భజరంగ్ దళ్ నునిషేధిస్తామని ప్రకటించడానికి బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని భజరంగ్ దళ్ నిషేధిస్తామని ప్రకటించి హిందూ ముస్లింల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. నేను పోస్టులో పొందుపరిచిన దానిని వెంటనే విరమించుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. అంతకు ముందు సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ హనుమాన్ చాలీసా పఠించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండాపురం జగన్ రాములు, విష్ణువర్ధన్ రెడ్డి, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed