రాంపూర్ వాసికి డాక్టరేట్ ప్రదానం

by Shiva |
రాంపూర్ వాసికి డాక్టరేట్ ప్రదానం
X

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్థిక శాస్త్ర విభాగంలో పరిశోధన

దిశ, చేర్యాల: ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఆర్థిక శాస్త్రం విభాగంలో మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు డాక్టర్ మలిపెద్ది బాల భాస్కర్ పీ.హెచ్.డీ పోందారు. ఆర్థిక శాస్త్రంలో 'ఏన్ ఎకనమిక్ అనాలిసిస్ ఆఫ్ మిడ్ డే మీల్స్ ప్రోగ్రాం ఇన్ తెలంగాణ, ఏ కేస్ స్టడీ ఆఫ్ సిద్దిపేట జిల్లా' అనే అంశంపై బాలభాస్కర్ పరిశోధన చేసి సిద్ధాంత గ్రంధాన్ని ఆర్థిక శాస్త్రం విభాగ అధిపతి ప్రొఫెసర్ నారాయణకు అందజేశారు. నిపుణుల కమిటీ ఈ గ్రంథాన్ని పరిశీలించి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీ.హెచ్.డీ) ని సిఫారసు చేసింది.

ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం గారి పర్యవేక్షణలో ఈ పరిశోధన చేశారు. ఆర్థిక శాస్త్రం అధిపతి ప్రొఫెసర్ బి.నారాయణ అవార్డుకు సంబంధించిన డిగ్రీ నోటిఫికేషన్ పట్టాను బాల భాస్కర్ కు మంగళవారం అందజేశారు. తాను డాక్టరేట్ పొందడానికి సహకరించిన తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు, గైడ్ కు బాల భాస్కర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాంపూర్ గ్రామంలోని మొట్టమొదటి సారిగా పీ.హెచ్.డీ పట్టా పొందిన డాక్టర్ బాల భాస్కర్ ను పలువురు అధ్యాపకులు, అధికారులు, విద్యార్థి నాయకులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించి అభినందించారు.

Advertisement

Next Story