ఆటో డ్రైవర్ ఆత్మహత్య కలచివేసింది

by Naresh |
ఆటో డ్రైవర్ ఆత్మహత్య కలచివేసింది
X

దిశ, సంగారెడ్డి : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ తన భార్యకు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచివేసిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… నిజామాబాద్‌లో ఆటో డ్రైవర్ దంపతుల ఆత్మహత్యపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్పందించారు. ఖిల్లా కెనాల్‌లో ఆటో డ్రైవర్ స్వామి, అతని భార్య ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల బతుకు బజారున పడిందని ఆరోపించారు. వెంటనే ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు.

అదే విధంగా ఆటో కార్మికులకు నెలకు రూ.10 వేల భృతి ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఆటో డ్రైవర్‌లను ఆదుకోవాలని వారికి రూ.10 వేలు భృతి చెల్లించాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ డియాండ్ చేసిందన్నారు. చెల్లెలికి ఆడియో రికార్డు పంపించి ఆయన ఆత్మహత్య చేసుకున్న ఘటన హృదయాన్ని కలిచివేసిందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం ఆపేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు, వంద రోజులకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది హామీలు అమలు చేయకుంటే ప్రజల తరఫున ప్రభుత్వం పై తిరగబడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, నరహరి రెడ్డి, ఆర్. వెంకటేశ్వర్లు , జీవీ.శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed