- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్న తల్లిపై హత్యాయత్నం.. తనయుడికి రెండేళ్ల జైలు
దిశ, సిద్దిపేట ప్రతినిధి: మద్యానికి బానిసై కన్నతల్లిని కడతేర్చాడానికి ప్రయత్నించిన కేసులో నిందితునికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ న్యాయస్థానం జడ్జి స్వాతిరెడ్డి తీర్పును వెల్లడించారు. సిద్దిపేట రూరల్ సీఐ జానకిరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నంగునూరు మండలం గట్ల మల్యాలకు చెందిన బండి తిరుపతి డ్రైవర్ గా పనిచేస్తూ.. మద్యానికి బానిసయ్యాడు. అతని వైఖరితో విసుగు చెందిన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
తిరుపతి పనికి వెళ్లడం పూర్తిగా మానేయడంతో డబ్బు కోసం అతని తల్లి బండి సారవ్వను నిత్యం వేధించేవాడు. డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని కూడా బెదిరించే వాడు. ఈ క్రమంలో 2021 జూలై 31న తిరుపతి తన తల్లిపై కత్తితో దాడి చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ తిప్పని రమేష్ 108కు సమాచారం అందజేసి సారవ్వను అసుపత్రికి తరలించి రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.ఎస్సై మైపాల్ రెడ్డి కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ తరలించారు. ఈ మేరకు కేసును పూర్తిగా శోధించి కోర్టులోచార్జిషీట్ దాఖలు చేశారు.
నాటి నుంచి నేటి వరకు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టులో విచారణ కొనసాగింది. ఇరువురి వాదనలు విన్న అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి స్వాతిరెడ్డి నేరం రుజువైనందున బండి తిరుపతికి రెండేళ్లు జైలు శిక్షను విధించారు. కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.రాధాకృష్ణ వాదనలు వినిపించారు. కోర్టు కానిస్టేబుల్, కోర్టు లైజనింగ్ అధికారులను పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు. త్వరలో వారికి రివార్డులు అందజేయనున్నట్లు ఆమె తెలిపారు.