- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెక్ డ్యాంలో పడి వృద్ధుడి మృతి
by Shiva |
X
దిశ, పాపన్నపేట: చెక్ డ్యాంలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఏడుపాయల వన దుర్గామాత సన్నిధి చెక్ డ్యాం వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. టేక్మాల్ మండల పరిధిలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన వడ్డే హనుమంత్(72) 16న ఏడుపాయలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. పొద్దుపోయినా ఇంటికి హనుమంతు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వాళ్ల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో సోమవారం ఏడుపాయల్లోని చెక్ డ్యాంలో నీటిపై హనుమంతు మృతదేహం పైకి తేలింది. దీంతో స్థానికులు సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. చేతులు కడుక్కునేందుకు హనుమంతు చెక్ డ్యాంలోకి దిగి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు పాపన్నపేట ఎస్సై విజయ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story