- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబేద్కర్ స్పూర్తిగా.. సీఎం కేసీఆర్ పాలన సాగిస్తుండ్రు: మంత్రి హరీష్ రావు
దిశ, సిద్దిపేట ప్రతినిధి: విద్యా, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు. హరీష్ రావు అన్నారు. డా. బీ. ఆర్. అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. మోడ్రన్ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మంత్రి తన్నీరు.హరీష్ రావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ, దళిత, బహుజన సంఘాల ప్రతినిధులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విద్యాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రంలోని వెయ్యి గురుకుల పాఠశాలను నెలకొల్పి ఇంటర్ వరకు విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. దీనికితోడు దళితుల ఆర్థిక అభ్యున్నతే ధ్యేయంగా దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. విదేశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ పథకంలో గత ప్రభుత్వాలు అప్పులిస్తే..బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రాంట్ రూపంలో అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర సచివాలయానికి ఓ వైపు అంబేద్కర్, మరో వైపు అమరవీరుల స్థూపం ఉందన్నారు. అంబేద్కర్, అమర వీరుల స్ఫూర్తితో పాలన సాగించాలనే ఉద్దేశ్యంతో దేశంలో అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయం వద్ద ప్రభుత్వం నిర్మించిందన్నారు. అంబేద్కర్ విగ్రహం ప్రతిమ కాదని, ప్రజల చైతన్య కలల దీపికగా అభివర్ణించారు. దేశం మొత్తంగా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. అంబేద్కర్ విగ్రహ అవిష్కరణ సభకు అంబేద్కర్ మన్మమడు ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో దళిత గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ వేలేటి. రోజాశర్మ, మున్సిపాల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, సుడా చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, దళిత సంఘాల ప్రతినిధులు సాకి బాల్ లక్ష్మీ ఆనంద్, గ్యాదరి రామస్వామి, నాయిని చంద్రం, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పథకాల లబ్దిదారులకు మంత్రి హరీష్ రావు ప్రొసిడింగ్ కాపీలను అందజేశారు.