- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబేద్కర్ రాజ్యాంగం దేశానికి దిక్సూచి : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్
దిశ, బెజ్జంకి : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం భారత దేశానికి దిక్సూచి అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం మండలంలోని చీలపూర్ పల్లి, దాచారం గ్రామాల్లో పరిధిలోని దాచారం గ్రామంలో బోయినిపల్లి వినోద్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ వేలేటీ రోజాశర్మ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పర్యటించగా అయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు.
చీలిపూర్ పల్లిలో నూతన గ్రామ పంచాయతీ, మహిళ సంఘం భవనం ప్రారంభించి దళిత బంధు యూనిట్లను సందర్శించి పరిశీలించారు. అనంతరం దాచారం గ్రామంలో కనగండ్ల రాజవ్వ మల్లయ్య జ్ఞాపకార్థం కుమారుడు కనగండ్ల మల్లయ్య రాములు దంపతులు తమ స్వంత ఖర్చులతో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహన్ని బోయినిపల్లి వినోద్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ కడగండ్ల కవిత కలిసి అవిష్కరించారు.
అనంతరం సుమారు రూ.20 లక్షల ఎస్డీఎఫ్, జడ్పీటీసీ నిధులతో నిర్మించిన అంబేడ్కర్ సామూహిక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ సమానత్వంతో కలిసి జీవించడానికి దిక్సూచిగా అంబేడ్కర్ రాజ్యాంగం రచించాడని.. రాజ్యాంగం ద్వారా భవిష్యత్తు తరాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నమన్నారు. భారత దేశంలోని 28 రాష్ట్రాల సచివాలయాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించడానికి రాష్ట్ర నూతన సచివాలయ భవనానికి బీఆర్ అంబేడ్కర్ సచివాలయంగా సీఎం కేసీఆర్ నామకరణం చేశారని తెలిపారు.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో 44 వేల చెరువులకు మరమ్మతులు చేసుకున్నామని వాటి ఫలితమే నేటి కోటి ఎకరాలకు సాగు నీరందిస్తున్నమన్నారు. దాచారంలోని సర్వే నెం.124లో ప్రభుత్వం సేకరించిన భూముల్లో గోప్ప పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు పెంటమీది శ్రీనివాస్, ఎర్రవెల్లి మమత, ఎంపీటీసీ కొలిపాక రాజు, అయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, అంబేడ్కర్ యువజన సంఘాల నాయకులు బోనగిరి శ్రీనివాస్, దీటి బాలనర్సు, బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు, గ్రామ అంబేడ్కర్ యువజన సంఘ సభ్యులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.