- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏకమవుతున్న సబ్బండ వర్గాలు
దిశ, పటాన్ చెరు : రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా సబ్బండ వర్గాలు ఏకమవుతున్నాయి. పటాన్ చెరు నియోజకవర్గంలో నీలం మధుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ వివిధ కుల సంఘాలు, యువత గొంతేత్తుతున్నారు. బీసీ వర్గానికి చెందిన బహుజన నాయకుడు నీలం మధుకు కేసీఆర్ టికెట్ కేటాయించాలనే డిమాండ్లు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 65 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గాన్ని కేసీఆర్ విస్మరించడం పట్ల ఆ వర్గం ప్రజలతో పాటు మిగిలిన బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పటాన్ చెరు టికెట్ పై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మచ్చ మత్సశాఖ డైరెక్టర్ మహేష్, బొమ్మను కుంట వార్డు సభ్యులు రాజు, మన్నే రాములు, ప్రభాకర్, మహేష్, యాదగిరి, బాల్ రాజ్, బిక్షపతి, కుమార్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.