- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఇంత వివక్షా..?
దిశ, సిద్దిపేట ప్రతినిధి: కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు దసరా సెలవుల్లో వేతనాలు ఇవ్వకపోవడం సరికాదని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శంకర్ అన్నారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు. కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో కాంట్రాక్ట్ ప్రతిపాదిక ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి, ప్రస్తుతం వారిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పరిగణించడం దారుణమన్నారు. దీనికి తోడు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల చెల్లింపులోను ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు దసరా సెలవులతో కూడిన పూర్తి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని శంకర్ హెచ్చరించారు.