- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు.. అధునాతన వైద్యం : మంత్రి హరీష్ రావు
దిశ, సిద్దిపేట ప్రతినిధి: క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలందించడమే ధ్యేయంగా.. సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం అదునాథన వైద్యం అందుబాటులోకి తీసుకొస్తుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దపేట జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో డే కేర్ కీమోథెరపీ సెంటర్ ను జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ తో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం, కరీంనగర్, వనపర్తి, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లా లో తొలుత కీమోథెరపి సేవలు అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజులల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నచోట కీమోథెరపీ సేవలు అందించడానికి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత ప్రప్రథమంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో సిద్దిపేటలోనే కీమోథెరపీ సేవలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు జిల్లా కేంద్రాల్లోని అసుపత్రుల్లో డయాలిసిస్ సేవలు అందిస్తున్న మాదిరిగానే క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు కిమోథెరపీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఎం.ఎన్.జే నిమ్స్ అసుపత్రులు రిఫర్ చేసిన పెషంట్లకు సిద్దిపేట కిమోథెరపీ సెంటర్ లో చికిత్స అందించడంతో పాటుగా, మందులు అందించనున్నట్లు ఆయన తెలిపారు. వ్యాధి తీవ్రతను బట్టి ప్రైవేట్ అసుపత్రిలో సుమారు రూ.4 నుంచి రూ.5 లక్షల ఖర్చ అయ్యే వైద్య సేవలు ఉచితంగా అందనున్నాయన్నారు.
దీంతో వ్యాధి బారిన పడిన పేద ప్రజలకు ఆర్ధిక భారం, వ్యయప్రయాసలు తప్పుతాయన్నారు. సిద్దిపేట జిల్లా పరిధిలో 468 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు తెలిపారు. క్యాన్సర్ ను ఆరోగ్య శ్రీలో చేర్చడంతో పాటుగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సుమారు రూ.800 కోట్లు ఉచిత సేవలు అందించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ అదేశాలతో క్యాన్సర్ నియంత్రణ కోసం మారుమూల ప్రాంతాలల్లో మోబైల్ స్ర్కీనింగ్ సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎం.ఎన్.జే ఆసుపత్రిని 700 పడకలకు విస్తరించి, రూ.120 కోట్లతో స్టేట్ కాన్సర్ సెంటర్ గా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో కాశీనాథ్, అసుపత్రి సూపరింటెండెంట్ కిషోర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ విమలాథామస్, మాజీ మున్సిపాల్ చైర్మన్ రాజనర్సు, తదితరులు పాల్గొన్నారు.