- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ శ్వేత మహంతి
దిశ, శివ్వంపేట: ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన 'ఆరోగ్య మహిళ:' కార్యక్రమం పట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత మహంతి వైద్య సిబ్బందిపై మండిపడ్డారు. మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తో కలిసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా శ్వేత మహంతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహళలు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆ విషయాన్ని ప్రభత్వం గ్రహించి ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా సేవలందించి అందులో మహిళలకు అన్ని రకాలుగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.
శివ్వంపేట ప్రభుత్వాసుపత్రిలో మాత్రం అలాంటి పరీక్షలు ఏమి నిర్వహించడం లేదని మండిపడ్డారు. మహిళలు ఎదుర్కొంటున్న వైట్ డిశ్చార్జి, బ్లడ్ క్యాన్సర్, రొమ్ము సంబంధ పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఎంతమందికి రక్త పరీక్షలు చేశారో, ఎంతమంది మూత్ర పరీక్షల శ్యాంపిల్స్ ను జిల్లా ఆసుపత్రికి పంపించారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ చేసిన పరీక్షల రిపోర్టులను ఎందుకు పంపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించి వాటి నిర్వహణ సక్రమంగా లేదంటూ అసహనం వ్యకం చేశారు.
రాష్ట్ర స్థాయిలో అధికారులు ఇంతగా కస్టపడి పని చేస్తుంటే మీరెందుకు ఇక్కడ ఇంత అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా అన్ని రకాల పరీక్షలు తప్పకుండా నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆమె ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని వైద్యులను ఆమె హెచ్చరించారు. శివ్వంపేట ప్రభుత్వాసుపత్రిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలిగించేలా ఆదేశాలివ్వాలని ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షులు, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ వినతిపత్రం అందించగా స్పందించిన కమిషనర్ జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రణాళికలు అందజేయాలని సూచించారు.
అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇందిరా క్రాంతి పథం సిబ్బందితో సమావేశమయ్యారు. గ్రామాలలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు మీకు కొంత వరకు తెలిసుంటాయని, వారికి ఆరోగ్య మహిళా పట్ల కొంత అవగాహనా కల్పించి ప్రభుత్వాసుపత్రిలో ప్రతి మంగళవారం నిర్వహించే వైద్య పరీక్షలకు వచ్చేలా కృషి చేయాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖధికారి డాక్టర్ చందునాయక్, ఉప వైద్యాధికారి విజయ నిర్మల, తహసీల్దార్ శ్రీనివాస్ చారి, ఎంపీడీవో నవీన్ కుమార్, ఎంపీవో తిరుపతి రెడ్డి, శివ్వంపేట డాక్టర్ సాయిసౌమ్య, డాక్టర్ సంధ్య, చిన్న గొట్టిముక్కుల సర్పంచ్ బాలమణి నరేందర్, దొంతి సర్పంచ్ పణిశశాంక్ శర్మ, గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మినర్సయ్య, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.