ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

by Naresh |
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్ధిపేట నియోజకవర్గంతో పాటు పట్టణంలో గత బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. కొందరూ బీఆర్ఎస్ నాయకులు రెవెన్యూ అధికారులు అండదండలతో ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జాలు చేశారని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ. ఇమామ్(అత్తు) ఆరోపించారు. గురువారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని పొన్నాల శివారులోని పోలీసు కన్వెన్షన్ హాల్ వెనకాల సర్వే నంబర్ 21లో 18 గుంటల ప్రభుత్వ భూమిని అప్పనంగా కబ్జా చేశారని ఆరోపించారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు రెవెన్యూ అధికారులతో కుమ్మకై కబ్జాలు చేశారని తెలిపారు. పొన్నాల గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి భర్త 18 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా విభజించి అమ్ముకున్నారని ఆరోపించారు. అలాగే డబుల్ బెడ్ రూంల వెనకాల రెస్ట్ రూమ్స్ నుంచి ఉన్న రోడ్డును కబ్జా చేసి ప్లాట్ చేసి అమ్ముతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల కబ్జాలకు గతంలో ఇక్కడ పని చేసిన తహశీల్దార్ల అండగా నిలిచారని తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన పొన్నాలకు చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గియాసుద్దీన్, ఫయాజ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed