రేపు బొల్లారంకు రానున్న రేసుగుర్రం నటుడు

by Naresh |   ( Updated:2023-11-21 16:49:48.0  )
రేపు బొల్లారంకు రానున్న రేసుగుర్రం నటుడు
X

దిశ, పటాన్ చెరు: రేపు బొల్లారానికి ప్రముఖ భోజ్ పూరి నటుడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్ ఎంపీ రవికిషన్ రానున్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. బొల్లారం పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఈ ఏరియాలో వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రజలు అత్యధికంగా నివాసం ఉండటంతో ఆ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ పార్టీ తరఫున రవి కిషన్ రోడ్ షోతో పాటు ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పటాన్ చెరు నియోజకవర్గంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ ఉత్తరాది ఓట్ల పై కన్నేశారు. ఈ క్రమంలోనే నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ తో ప్రచారం నిర్వహించనున్నారు. రేపు మూడు గంటల ప్రాంతంలో ఎంపీ రవి కిషన్ బొల్లారం మున్సిపాలిటీకి చేరుకుని బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారని నందీశ్వర్ గౌడ్ వెల్లడించారు.

Advertisement

Next Story