- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేదల బాగు కోసం నిరంతరం తపించే వ్యక్తి లింగన్న: మంత్రి హరీష్ రావు
దిశ, దుబ్బాక: నియోజకవర్గంలోని పేద ప్రజల అభివృద్ధి, యోగ క్షేమాల కోసం నిరంతరాయంగా లింగన్న తండ్లాడే వైవిధ్యమైన వ్యక్తి అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు కొనియాడారు. సోమవారం దివంగత సోలిపేట రామలింగారెడ్డి జయంతిని పురస్కరించుకొని దుబ్బాక డబుల్ బెడ్ రూమ్ ల వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రామలింగారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. రామలింగారెడ్డి విగ్రహాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరిస్తానని ఊహించలేదన్నారు. లింగన్న అంటేనే వైవిధ్యాల సమ్మేళనం, వామపక్ష భావజాలం, జర్నలిస్టుల సంక్షేమం, గన్నుతో, పెన్నుతో పోరాటం చేసిన వ్యక్తిగా అందరి కంటే భిన్నంగా ఉండేవారని తెలిపారు.
రామలింగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటే దుబ్బాక గడ్డమీద గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపు నిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో జొడెడ్లుగా లింగన్న నేను కలిసి పని చేశామన్నారు. మానుకోట రాళ్లదాడి, తూటాల వర్షాన్ని ఎదురుకొన్నామని, మనోహరాబాద్, రైల్వే రోకో, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద 48 గంటలు ధర్నా, నిరసనలు చేసిన జ్ఞాపకాలను గుర్తు చేశారు. తెలంగాణాలో జాకీలు పెట్టి లేపినా బీజేపీ లేవదని, కాంగ్రెస్ గెలిచేది లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పారు. సోలిపేట కుటుంబానికి రాజకీయంగా అండగా ఉంటానని తెలిపారు.