భార్యతో గొడవపడి... పురుగుల మందు తాగిన భర్త

by Naresh |   ( Updated:2024-01-13 15:54:19.0  )
భార్యతో గొడవపడి... పురుగుల మందు తాగిన భర్త
X

దిశ, పాపన్నపేట: భార్యతో గొడవ పడి మనస్థాపంతో వ్యక్తి పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పాపన్నపేట మండల పరిధిలోని రాజ్య గిరిజన తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. పాపన్నపేట ఏఎస్ఐ గాలయ్య సమాచారం మేరకు.. మండల పరిధిలోని రాజ్య గిరిజన తండాకు చెందిన రాములు(55)కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సక్కుబాయి‌తో పాటు మరొకరు ఉన్నారు. వీరు ముగ్గురు మధ్య సంసారం విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈనెల 12న మొదటి భార్య అయిన సక్కుబాయ్ భర్త రాములుకు చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన రాములు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య సక్కుబాయి రాములుని మెదక్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ విషయమై భార్య సక్కుబాయి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్ఐ గాలయ్య వివరించారు.

Read More..

తల్లి మందలించడంతో ఆత్మహత్య

Advertisement

Next Story