- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల పై సమగ్ర విచారణ జరిపించాలి
దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాల పై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ ఆఫీస్ వద్ద వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా ఉన్న పరిశ్రమ యాజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టాలని, జిల్లాలో పరిశ్రమల ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని కార్మికుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోరా అని ప్రశ్నించారు. నెల రోజుల్లో 5 చోట్ల జరిగిన ప్రమాదంలో 5 గురు చనిపోగా సుమారు 50 మంది వరకు గాయపడ్డారని అన్నారు. మార్చి 4 నుంచి 10 వరకు జాతీయ భద్రతా దినోత్సవాలలో కూడా కోవాలెంట్ పరిశ్రమలో ఇద్దరు కార్మికులు చనిపోతే అనేకమంది గాయపడ్డారన్నారు. బొల్లారం అమర్ కెమికల్ పరిశ్రమ, పాశమైలారం మీనాక్షి లైఫ్ సైన్సెస్, టైర్ల పరిశ్రమ, జిన్నారం మండలంలో లీ ఫార్మాలో భారీ ప్రమాదం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఫసల్వా ది శివారులోని గణపతి ఫ్యాక్టరీలో ఒక కార్మికుడు మృతి చెందాడు, బోర్పట్ల అరబిందోలో కార్మికుడు మృతి చెందిన బయటకు రావడం లేదన్నారు.
ఈ ఘటనలపై స్పందించాల్సిన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీరిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఎక్కడా సరిగ్గా తనిఖీలు చేయడం లేదని ఆరోపించారు. వరుస ఘటనలు జరుగుతున్నా వాటిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. మల్లేశం, కె.రాజయ్య, పటాన్చెరు ఏరియా కమిటీ నాయకులు పాండు రంగారెడ్డి, నాగేశ్వరరావు, జార్జ్, యన్. శ్రీనివాస్, నరసింహ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.