రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.. శ్రీనివాస్ గౌడ్

by Sumithra |
రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.. శ్రీనివాస్ గౌడ్
X

దిశ, గుమ్మడిదల : రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రజలు తమసంపూర్ణ మద్దతును కాంగ్రెస్ కే తెలియజేస్తున్నారని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీఆర్ఎస్ యువనాయకుడు బషీర్ వారి బృందం 200 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా వీరందరికీ పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ అసమర్ధ పాలనకు చర్మ గీతం పలికే రోజు అతిత్వరలోనే ఉందని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, బొల్లారం మున్సిపాలిటీ ప్రెసిడెంట్ జైపాల్, జనరల్ సెక్రటరీ లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ సంతోష లక్ష్మారెడ్డి, ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ సోహెల్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇమ్రాన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed