రేపటి నుంచి 10 పరీక్షలు..

by Sumithra |
రేపటి నుంచి 10 పరీక్షలు..
X

దిశ, సంగారెడ్డి : నేటి నుంచి జిల్లాలో 10 పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో 3వ తేదీ నుండి 13వ తేదీవరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు 21,389 మంది రెగ్యులర్, 24 మంది ప్రైవేట్, 1131 మంది ఒకేషనల్ అభ్యర్థులు హాజరు కానున్నారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు 118 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉ.9.30 నుండి మ.12.30 వరకు పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్దులు ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

పదవతరగతి పరీక్షల నిర్వహణకుగాను జిల్లాలో 118 పరీక్ష కేంద్రాలను, 26 స్టోరేజ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పరీక్షలు పకడ్బందీగా జరిగేందుకు 5గురు ఫ్లయింగ్ స్క్వాడ్లను, 18 మంది రూట్ ఆఫీసర్లను, 118 మంది చీఫ్ సూపర్డెంట్లను, 118 మంది డిపార్ట్మెంటల్ అధికారులను, ఒక అడిషనల్ డిపార్ట్మెంటల్ అధికారిని, సుమారు 1100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి తీసుకురాకూడదు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో మంచినీరు, టాయిలెట్స్, సరైన వెలుతురుకు లైట్లను, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed