మా సామాజిక వర్గం ఏం పాపం చేసింది..? : బీఆర్ఎస్ నాయకుడు నీలం మధు ముదిరాజ్

by Naresh |   ( Updated:2023-08-22 09:52:43.0  )
మా సామాజిక వర్గం ఏం పాపం చేసింది..? : బీఆర్ఎస్ నాయకుడు నీలం మధు ముదిరాజ్
X

దిశ, సంగారెడ్డి: రాష్ట్రంలో 60 లక్షల ముదిరాజ్ ఓటర్లు ఉన్నా.. కనీసం ఒక్క అసెంబ్లీ సీటు కూడా కేటాయించకపోవడం దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.కేసీఆర్ పై ఎంతో నమ్మకం పెట్టుకున్నామని, పటాన్ చెరు టికెట్ ముదిరాజ్ సామాజిక వర్గానికి కేటాయిస్తారనుకుంటే నిరాశే మిగిలిందన్నారు. పటాన్ చెరు టికెట్ పై సీఎం కేసీఆర్ పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇతర సామాజిక వర్గాలకు స్థానం కల్పించిన కేసీఆర్ ముదిరాజ్ వర్గాన్ని పక్కన పెట్టారని విమర్శించారు. అవసరమైతే ప్రత్యేక సిబ్బందితో సర్వేలు జరిపించి తర్వతే ముదిరాజ్‌లకు సీటు కేటాయించాలని కోరారు. లేదంటే తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

Advertisement

Next Story