- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవినీతికి, స్కాములకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్: మేడే రాజీవ్ సాగర్ ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: అవినీతికి, స్కాములకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ అని.. ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. హైదరాబాద్‌కు తరలిస్తుండగా బెంగళూరులోని కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో పట్టుబడ్డ రూ. 42 కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. కర్ణాటకలో గెలిచి ఆరుమాసాలు గడవక ముందే వసూళ్ల పర్వానికి తెరలేపారని విమర్శించారు. అక్కడ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో తెలంగాణలో గెలువాలని చూస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని.. అందుకే వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని ఆరోపించారు.
అక్కడి బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి వేల కోట్లు వసూలు చేసిన డబ్బులను తెలంగాణకు తరలిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇదే తరహాలో ఇతర రాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణ నుంచి అక్రమంగా డబ్బు తరలించడం ఖాయమన్నారు. అంతేకాదు ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్నే అమ్ముతారని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి.. ఇతర రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.