మాయావతి తెలంగాణ టూర్ డేట్ ఫిక్స్

by Anjali |
మాయావతి తెలంగాణ టూర్ డేట్ ఫిక్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కుల రాజకీయాల్ని, దొరలహంకారాన్ని కాలరాయడానికి తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వడానికి బెహంజీ మాయావతి తెలంగాణ గడ్డపైకి వస్తున్నారని తెలంగాణ బీఎస్పీ నాయకులు అంటున్నారు. ఈ నెల 7న ఆ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సరూర్ నగర్‌‌లోని విద్యార్థి అమరుల ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్య అతిధిగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి హాజరుకానున్నారు. తెలంగాణ భరోసా పేరుతో ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బహిరంగ సభ ఏర్పాట్లు చకచకాగా జరుగుతున్నాయి. అసమానతలు, అణివేతలు, దొరల గడీల పాలన నుంచి విముక్తి కోరుతూ ఈ సభను నిర్వహిస్తున్నారు. మే 7 (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభకు వేలాది మందిగా తరలిరావాలని బీఎస్పీ నాయకులు కోరుతున్నారు. కాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మాయావతి తొలిసారిగా రాష్ట్రానికి రానున్నారు. దీంతో మాయావతి ఏం మాట్లాడుతారోననే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.

Advertisement

Next Story