దీపావళి క్రాకర్స్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

by GSrikanth |
దీపావళి క్రాకర్స్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి సన్‌సిటీలోని ఓ క్రాకర్స్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న దుర్గాభవాని ఫుడ్‌ జోన్‌కు మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ఫుడ్‌ జోన్‌లోని గ్యాస్ సిలిండర్ పేలింది. సిలిండర్ కారణంగా మరో మూడు దుకాణాలకు మంటలు వ్యాపించి అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో ఉలిక్కిపడ్డ స్థానికులు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. నాలుగు దుకాణాల నుంచి మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతుంటడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నాలుగు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. రాత్రి వేళ దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యా్ప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story