- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్ మెడికో ప్రీతి మృతిపై మావోయిస్టుల స్పందన
దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయిదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రీతి ఆదివారం కన్నుమూసింది. హైదరాబాద్ నిమ్స్‌లో చేరినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్న ఆమె ఆదివారం రాత్రి 9.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. తాజాగా.. ప్రీతి మరణంపై మావోయిస్టులు స్పందించారు.
ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పేరిట లేఖ విడుదల చేశారు. వైద్య విద్యార్థిని ప్రీతి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ర్యాగింగ్ వల్లే ప్రీతి ఆత్మహత్య చేసుకున్నా.. అధికారులు దాన్ని కప్పిపుచ్చడంతోపాటు సైఫ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాలేజీల్లో ర్యాగింగ్ నిత్యకృత్యమైందని వారు లేఖలో పేర్కొన్నారు.