- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఘట్కేసర్‌లో TRSకు షాక్.. ఈటల సమక్షంలో భారీగా BJPలో చేరికలు
దిశ, శామీర్‌పేట్: తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించేందుకు బీజేపీ శ్రేణులు కంకనబద్ధులై పని చేస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, అవుసపూర్ సర్పంచ్ కావేరి మచెందర్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ ప్రవీణ్ రెడ్డి, బీసీ మండల అధ్యక్షుడు బసవరాజ్ గౌడ్, యూత్ అధ్యక్షుడు బాలు యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవి, ఉప సర్పంచులు నరేష్, రవి వార్డు సభ్యులు సురేష్, నరసింహ మల్లేష్, రవి నాయక్, పద్మ రాధా, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కిరణ్, మాజీ ఎంపీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కృష్ణాగౌడ్, రాజు ముదిరాజ్ సహా భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. వీరికి మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. నేడు బీజేపీలో చేరికలు ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు గడ్డు కాలమే అన్నారు. కేసీఆర్ మాటలు ఎవరూ నమ్మబోరని, ఆయన పాలనకు అంతిమ రోజులు వచ్చాయన్నారు. ప్రజా వ్యవస్థ పాలనలో కేసీఆర్ మాటలను నమ్మలేని ప్రజలు మేడ్చల్ కాలెక్టరేట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నారని అన్నారు. ఆ సభకు జనాలు రాకపోవడంతో గ్రామ పంచాయతీ కార్మికులకు డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టినట్లు తెలిసిందన్నారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు. పార్టీలో చేరిన ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నేతలకు సాధరంగా ఆహ్వానం పలుకుతూ బీజేపీ పార్టీ కండువాను కప్పారు.