- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు రాష్ట్రానికి మాణిక్ రావు థాక్రే.. T-కాంగ్రెస్ నేతలతో వరుస మీటింగ్స్!
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. వరుస టూర్లతో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్ రావు థాక్రే పార్టీలో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. బాధ్యతలు తీసుకున్నాక వరుసగా రాష్ట్రానికి వస్తున్న ఆయన.. తాజాగా ఇవాళ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఇటీవల మరణించిన సోషల్ మీడియా రాష్ట్ర కో ఆర్డినేటర్ సింధు శంకర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తారు.
అనంతరం రాత్రి 8 గంటలకు టీపీసీసీ ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీష్ కూతురు రిసెప్షన్ విందులో పాల్గొంటారు. రేపు ఉదయం గాంధీభవన్‌లో టీపీసీసీ ఎస్టీ సెల్ కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లతో భేటీ అవుతారు. మధ్యాహ్నం పార్టీ వైస్ ప్రెసిడెంట్లతో సమావేశమై హాత్ సే హాత్ జోడో యాత్రపై రివ్యూ నిర్వహిస్తారు. సాయంత్రం కిసాన్ కాంగ్రెస్ చైర్మన్, జిల్లా అధ్యక్షులతో భేటీ అవుతారు. అనంతరం గురువారం సాయంత్రం నాగ్ పూర్ కు తిరిగి ప్రయాణం అవుతారని పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.