- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టేట్ బడ్జెట్లో 60 శాతం KCR ఫ్యామిలీ చేతుల్లోనే: మానిక్ రావ్ థాక్రే
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బడ్జెట్లో 60 శాతం నిధులు కేసీఆర్ ఫ్యామిలీ చేతుల్లో ఉన్నదని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మానిక్ రావ్ థాక్రే పేర్కొన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం 1200 మంది యువకులు ప్రాణత్యాగం చేయగా.. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు బోగాలు అనుభవిస్తున్నారన్నారు. పదేళ్లుగాప్రజలను మోసం చేస్తూనే ఉన్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని సోనియమ్మ తెలంగాణను ఇచ్చారని, కానీ వచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ తన సొంత ఏజెండాను అమలు చేస్తున్నారన్నారు. ఉద్యమ ద్రోహులకు రెడ్ కార్పెట్ వేసి.. ఉద్యమకారులకు మొండి చేయి చూపించారన్నారు.
ఉద్యమకారుడు విఠల్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏ ఒక్కరూ వల్ల రాలేదని, త్యాగాలు ప్రజలవి.. భోగాలు కేసీఆర్ కుటుంబానివి అని ఫైర్ అయ్యారు. ‘దంచుడే దించుడే’ నినాదంతో పౌర సమాజం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక వేళ తప్పులు జరిగితే ప్రశ్నించే అవకాశం ఉంటుందని, కానీ ఇప్పుడు గడీల పాలన నెలకొన్నదన్నారు. పార్టీ పేరులో తెలంగాణ తీసేసిన వాళ్లకు మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. పదేళ్ల పాలనలో అమరుల అడ్రస్లు కేసీఆర్కు దొరకకపోవడం ఆశ్చర్యకరమన్నారు. కానీ పంజాబ్ రైతులు చనిపోతే పరిహారం చెల్లించారని గుర్తు చేశారు. ప్రజలంతా కాంగ్రెస్కు మద్ధతుగా నిలవాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు.