బీఎస్పీ స్టేట్ చీఫ్‌గా మంద ప్రభాకర్!

by Ramesh N |
బీఎస్పీ స్టేట్ చీఫ్‌గా మంద ప్రభాకర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఎస్పీ పార్టీలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాజాగా పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మంద ప్రభాకర్‌ను పార్టీ హైకమాండ్ నియమించినట్లు సమాచారం. మంద ప్రభాకర్ ఆర్ఎస్పీ కంటే ముందు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు.

బీఎస్పీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉండదు

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేయడం బీఎస్పీ పార్టీలోని క్యాడర్ నిరాశ చెందినట్లు తెలిసింది. కాగా, ఆర్ఎస్పీ చెప్పినట్లుగా బీజేపీ ఒత్తిడితోనే పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. అయితే బీఎస్పీ చీఫ్ మాయావతి ఎవరి ఒత్తిళ్లకు తలోగ్గదని పార్టీ క్యాడర్ చెబుతోంది. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి ఆదేశాల మేరకు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి ఎన్నికల పొత్తు ఉండదని తాజాగా మంద ప్రభాకర్ ట్వీట్ చేశారు. అదేవిధంగా మరే ఇతర పార్టీతో కూడా పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రంలోని 17 స్థానాల్లో అన్నిటిలో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story