Manchu Family : మంచు విష్ణు సిబ్బంది అడవి పందుల వేట..పోలీసుల కీలక ప్రకటన

by Y. Venkata Narasimha Reddy |
Manchu Family : మంచు విష్ణు సిబ్బంది అడవి పందుల వేట..పోలీసుల కీలక ప్రకటన
X

దిశ, బడంగ్ పేట్ : మంచు ఫ్యామిలీ(Manchu Family) లో అంతర్గత కలహాల మంటలు చల్లారక ముందే అడవి పందిని(Hunted Wild Boar) వేటాడి తీసుకెళ్తున్న ఓ వీడియో వైరల్ గా మారడంతో మోహన్ బాబు(Mohan Babu) సిబ్బంది మరో వివాదంలో చిక్కుకున్నారు. జల్ పల్లి లోని మంచు ఫ్యామిలి నివాసం సమీపంలోని గరిగుట్ట అడవి(Garigutta forest in Jalpalli)లో మంచు విష్ణు సిబ్బంది వేటాడిన అడవి పందిని మంచు టౌన్ లోకి దర్జాగా తీసుకు వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. దీనిపై స్పందించిన పహాడి షరీఫ్ పోలీసులు ఇది పాత వీడియో అని తేల్చారు.

వివరాలలోకి వెళితే...

జల్ పల్లి మంచు టౌన్ కు చెందిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గత పదేళ్లు గా అక్కడే నివసిస్తున్నారు. మంచు మనోజ్ ఇది వరకే కొడుకు ఉన్న మౌనిక ను రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఇది మోహన్ బాబు కు ఇష్టం లేదని అక్కడ పనిచేసే సిబ్బంది సంచలన విషయాలు బయట పెట్టిన విషయం విధితమే. అప్పటి నుంచి మోహన్ బాబు ఇంట్లో కలతలు చెలరేగాయని గత డిసెంబర్ 7 వ తేదీన మంచు టౌన్ లో పని మనుషుల విషయంలో చెలరేగిన ఘర్షణ రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా మోహన్ బాబు, విష్షు సిబ్బంది మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషన్ దేవేంద్ర ప్రసాద్ తో పాటు మరో వ్యక్తి గరిగుట్ట అడవి లో అడవి పంది ని వేటాడి బందించి భుజాల పై మంచు టౌన్ లోకి తీసుకెళ్తున్న పాత దృశ్యాలు మంగళవారం వైరల్ గా మారాయి. వణ్య ప్రాణులను వేటడొద్దని మంచు మనోజ్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషన్ దేవేంద్ర ప్రసాద్ లు ఏనాడూ పట్టించుకోలేదన్న సారాంశంతో కూడిన వీడియో, కథనం వైరల్ అవ్వడాన్ని చూస్తే ఇది కావాలనే మంచు మనోజ్ వైరల్ చేశాడన్న ప్రచారం ఉపందుకుంది. అడవి పందిని బంధించి మోసుకెళ్తున్న ముగ్గురు ఎవ్వరు? అన్నది కూడా ఇంకా తేలాల్సి ఉంది.

ఎప్పటి నుంచి వేటాడుతున్నారు?

మోహన్ బాబు సిబ్బంది అడవి పందిని వేటాడి మంచు టౌన్ లోకి తీసుకెళ్తున్న వీడియోలు వైరల్ గా మారడంతో అసలు ఇప్పటి వరకు ఎన్ని వణ్యమృగాలను వేటాడారు? ఎవరు చెబితే వేటాడుతున్నారు ? వీరికి ఎవరు సహకరిస్తున్నారు? ఫామ్ హౌజ్ లలో గుట్టు చప్పుడు కాకుండా అసలు ఎం జరుగుతుందన్నదని పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సిఉంది. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు ఎలా స్పందిస్తారు? అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story