విద్యుత్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 7 శాతం ఫిట్‌మెంట్‌

by Vinod kumar |
విద్యుత్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 7 శాతం ఫిట్‌మెంట్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేసే సిబ్బంది, ఆర్టీజన్ల వేతన సవరణ, ఇతర అలెవెన్సులకు సంబంధించిన అంశం ఇప్పటికే కొలిక్కి వచ్చింది. కాగా పలు చర్చల అనంతరం 7 శాతం ఫిట్ మెంట్ కు సంస్థలు ఒకే చెప్పాయి. క్లాస్ 1 నుంచి 4 మినహా మిగిలిన వారికి మాస్టర్ పే స్కేల్ ఇచ్చేందుకు సంస్థ అంగీకరించింది. నాలుగేళ్ల పాటు 7 శాతం ఫిట్ మెంట్ కు అంగీకారం తెలిపింది. ఈమేరకు యాజమాన్యం.., ఉద్యోగులకు హామీ ఇచ్చిన అన్ని అంశాలపై బుధవారం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. హైదరాబాద్ లేబర్ కమిషనర్ సమక్షంలో 12(3) అగ్రిమెంట్ పై ట్రేడ్ యూనియన్లు, యాజమాన్యం సంతకాలతో ఒప్పందాన్ని పూర్తిచేసుకున్నాయి.

గుర్తింపు పొందిన కార్మిక సంఘాల కార్యవర్గ సభ్యులు(1104 యూనియన్, 327, 1535, టీఆర్ఎస్ కేవీ) సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ శ్యాం సుందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల్లో పనిచేసే సిబ్బంది, ఆర్టీజన్ల వేతన సవరణపై పూర్తి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ సెక్షన్12 (3) ప్రకారం విద్యుత్ సంస్థల్లో సమ్మెలు చేపట్టడం చట్టవిరుద్ధమని, ఒక వేళ ఎవరైనా, ఏదైనా సంఘం ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే ఎస్మా చట్టం నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed