- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఢిల్లీ అధికార ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు. నాగర్ కర్నూలు లోక్‌సభ సీటు ఆశిస్తున్న మల్లు రవి.. టికెట్ కోసమే పదవి వదులుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన మహబూబ్‌నగర్ జిల్లా జడ్జర్లలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
వారం రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి రాజీనామా లేఖను పంపినట్లు వివరించారు. నాగర్‌కర్నూల్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు. కాగా, గత జనవరి 28న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మల్లు రవి తన పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీలో హాట్ టాఫిక్‌గా మారింది.