- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లాస్య నాకు చెప్పిన చివరి మాట ఇదే.. కన్నీళ్లు పెట్టుకున్న మల్లారెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, యువ నేత లాస్య నందిత కారు ప్రమాదంలో మరణించడంతో అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. లాస్య మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఈ క్రమంలోనే లాస్య మృతిపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందిచారు. తాను ఇవాళ మేడారం జాతరకు వెళ్లారని, ఉదయం లాస్య మృతి వార్త వినగానే షాక్‌కు గురయ్యాని తెలిపారు. వాళ్ల తండ్రి దివంగత నేత సాయన్న గత ముప్పై ఏళ్ల నుంచి పరిచయమని ఆవేదన వ్యక్తంచేశారు. తన ఇళ్లు కూడా కంటోన్మెంట్ పరిధిలోనే ఉంటదన్నారు. లాస్యకు ఇటీవల రెండు ప్రమాదాలు జరిగాయని గుర్తుచేశారు.
సాయన్న చనిపోయిన ఒక సంవత్సరం అయ్యిందన్నారు. ‘మీ నాన్న నాకు మంచి స్నేహితుడు, మీ నాన్నకు నమ్కీన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అంటే అవును అంకుల్ అని చెప్పింది. అదే తనతో మాట్లాడిన చివరి మాట’ మల్లారెడ్డి ఆవేదనకు లోనయ్యారు. అంకుల్ అంకుల్ అని నాతో బాగా మాట్లాడేది.. చిన్న వయసులో, మంచి రాజకీయ భవిష్యత్తు ఉండేది. కానీ భగవంతుడు ఇంత త్వరగా తీసుకపోతడని అనుకోలేదని మల్లారెడ్డి తెలిపారు.