- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచిర్యాల భారత్ సత్యగ్రహ సభను సక్సెస్ చేయండి : రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: భారత్ సత్యగ్రహ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 14న రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా అక్రమ కేసులు నమోదు చేసిందన్నారు. రెండేళ్ల జైలు శిక్ష పడేలా చేసి ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేసిందన్నారు. అనర్హత వేటు తర్వాత ఒక్క రోజులోనే ఇంటిని సైతం ఖాళీ చేయించి భారీ కుట్రకు తెరలేపిందన్నారు.
దేశంలోని జాతీయ సంపదను ప్రజా ఆస్తులను ఆధానికి ధారాదత్తం చేసి అవినీతికి పాల్పడుతున్న అంశాలపై రాహుల్ గాంధీ నిలదీయడం, ఆధాని అక్రమ సంపాదనలపై, హిండెన్ బర్గ్ నివేదికల ఆధారంగా జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలన్న డిమాండ్ చేస్తున్న తరుణంలో రాహుల్ గాంధీపై ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండి పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, రాహుల్ గాంధీకి మద్దతుగా, సిఎల్పీ భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రలో భాగంగా మంచిర్యాలలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ఈ సభకు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ సెక్రెటరీ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే లతో పాటు సీనియర్ నాయకులు అందరూ పాల్గొంటారన్నారు. ఈ బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృతనిశ్చయంతో పనిచేసి, ప్రజలను భాగస్వాములను చేసి సభ విజయవంతానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. నాయకులు కార్యకర్తలు, జన సమీకరణ చేసి మంచిర్యాలకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.